తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

293

మార్చి నెల సమీపిస్తుండంతో ఎండల తీవ్ర మొదలైంది. పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు దాటుతున్నాయి. తెల్లవారు జామున మాత్రం కొద్దిగా చలి ఉంటుంది. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా భాగ్యనగర్ నందనవనంలో 12.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో 37.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు 18.4 డిగ్రీలుగా నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది.

జీహె‌చ్‌‌ఎంసీ పరి‌ధి‌లోని రాజేం‌ద్ర‌న‌గ‌ర్‌లో అతి తక్కు‌వగా 15.4 డిగ్రీలు, అత్య‌ధి‌కంగా అమీ‌ర్‌‌పే‌టలో 34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్ర‌తలు నమో‌ద‌య్యాయి. రాష్ర్టంలో పొడి వాతా‌వ‌రణం నెల‌కొ‌న్నది. ఇక కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆదిలాబాద్ లో కూడా తెల్లవారు జామున చలితీవ్రత అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రామగుండంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు