అయోధ్యలో మసీదు నిర్మాణానికి అధికారిక శంకుస్థాపన..

265

అయోధ్య కేసులో 2019 నాటి సుప్రీం కోర్టు తీర్పులో ముస్లిం సోదరులకు దక్కిన దాదాపు 5 ఎకరాల విస్తీరణంలో మసీదు నిర్మాణ పనులు మొదలయ్యాయి. మంగళవారం మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. అయోధ్య జిల్లాలోని ధన్నీపుర్ గ్రామ సమీపంలో మసీదు నిర్మాణ పనులను ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ మొక్కలు నాటి లాంఛనంగా ప్రారంభించింది. శంకుస్థాపనకు ప్రతీకగా మసీదు నిర్మాణానికి సంబంధించిన ఐదెకరాల స్థలంలో ఫౌండేషన్ ప్రతినిధులు మొక్కలు నాటారు.

ఇండో-ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు జాఫర్‌ అహ్మద్‌ ఫరూఖీ మంగళవారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఐదెకరాల స్థలంలో ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే మసీదు ఎలా ఉండాలనే దానిపై డిజైన్లు కూడా సిద్ధంగా ఉండగా మసీదు నిర్మాణం చేపట్టే స్థలంలోని మట్టి పరీక్షలను పంపించారు. ఆ నివేదికలు వచ్చిన అనంతరం నిర్మాణం మొదలు కానున్నట్లుగా ట్రస్ట్ సభ్యులు చెప్పారు.

అయోధ్యలో మసీదు నిర్మాణానికి అధికారిక శంకుస్థాపన..