అభ్యర్థుల ఎంపిక.. తేలకుండానే ముగిసిన బీజేపీ సమావేశం!

284

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఆయా రాష్ట్రాలలో పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే హొరాహొరీ ప్రచారం ప్రారంభించిన పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో అన్ని సమీకరణాలను బేరీజు వేసుకుంటున్నాయి. దేశంలో అధికార పార్టీ అయిన బీజేపీ ఆయా రాష్ట్రాలలో అభ్యర్ధుల ఎంపిక మొదలుపెట్టి౦ది. ఇందుకోసం శుక్రవారం బీజేపీ సీఈసీ సమావేశం నిర్వహించింది. ముందుగా బంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులపై నిర్ణయం తీసుకోవాలని ఏర్పడిన సీఈసీ సమావేశం తుది నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించింది. ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షా సహా ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరవగా నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయారు. ఇక అటు అసోంలో బీజేపీ, దాని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం కొలిక్కి వస్తోంది. 86 సీట్లలో పోటీపై బీజేపీ, అసోం గణపరిషత్‌, యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌ మధ్య ఒప్పందం కుదిరింది.

అభ్యర్థుల ఎంపిక.. తేలకుండానే ముగిసిన బీజేపీ సమావేశం!